నారుమడిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి బూటక్లోర్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటితో కలిపి, విత్తన 7 లేక 8 వ రోజున మడిలో నీటిని తీసివేసి పిచికారి చేయాలి, లేదా విత్తన 14,15 రోజులప్పుడు సైహలోఫాప్ బ్యుటైల్ 10 శాతం 40౦ మి.లీ. 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి.
మాగాణి వరిలో ఊద మొదలైన ఏక వార్షిక గడ్డి జాతి మొక్కలు ఉన్నప్పుడు బ్యుటాక్లోర్ 50 శాతం 1 నుండి 1.5 లీటర్ లేదా అనిలోఫాస్ ౩౦ శాతం 50౦ మి.లీ. లేదా ప్రిటిలాక్లోర్ 50 శాతం 50౦ మి.లీ. లలో ఏదో ఒకదానిని ఎకరాకు 25 కిలోల పొడి ఇసుకతో కలిపి, నాటిన ౩ నుండి 5 రోజులలో పలుచగా నీరు పెట్టి సమానంగా వెదజల్లాలి.
గడ్డి, తుంగ, వేడల్పాటి ఆకు మొక్కలు సమపాళ్ళలో ఉన్నప్పుడు ఎకరాకు 4 కిలోల బ్యుటాక్లోర్ 5 శాతం గుళికలు మరియు 4 కిలోలు 2, 4-డి ఇథైల్ ఎస్టర్ 4 శాతం గుళికలు, 20 కిలోల పొడి ఇసుకతో కలిపి నాటిన ౩ నుండి 5 రోజుల్లో పలుచగా నీరు ఉంచి సమానంగా వెదజల్లాలి.